భద్రత విషయంలో కొరవడిని నిఘా

భద్రత విషయంలో  కొరవడిని నిఘా

భద్రత విషయంలో ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని అధికారులు చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వీటి నిర్వహణను సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే గత కొంతకాలం నుంచి కొన్నిచోట్ల ఈ కెమెరాలు పనిచేయక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదైనా నేరం జరిగితే దాన్ని రుజువు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేయడానికి న్యాయస్థానాల్లో సాక్ష్యాలు కచ్చితంగా అవసరం,  ఎన్నో  క్లిష్టమైన కేసుల ఛేదనలో నిందితులకు సంబంధించిన కీలకమైన ఆధారాలను పోలీస్ అధికారులకు సీసీటీవీ ఫుటేజీలు ఎంతగానో ఉపయోగపడతాయి. 

కానీ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పలు చోట్ల పేరుకు  50కి  పైగా సీసీ కెమెరాలను  ఏర్పాటు చేసిన వాటిలో  సరిగ్గా పని చేసేవి  ఐదు, ఆరు మాత్రమే.  కొట్లాటలు  జరిగినా లేదా ఎవరైనా వ్యక్తులు మరణానికి గురైనా కొన్నిసార్లు ఆ ప్రదేశానికి పోలీసులు హుటాహుటిన  అక్కడికి చేరుకొని   అదుపు చేయడానికి ఆలస్యం కావొచ్చు. కావున ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైన దృశ్యాలను  ఆధారంగా చేసుకుని  దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడం తేలికవుతుంది. కావున నిరూపయోగంగా ఉండి పనిచేయని సీసీ కెమెరాలను తొలగించి సత్వరమే వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చేలా చర్యలు తీసుకోవాలి. 

-
 కె. శ్రావణ్, జనగాం