యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ భద్రతా సిబ్బంది ఆలయ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను విస్మరించారు. ప్రధానాలయంలో విధులు నిర్వహించే సిబ్బంది సెల్ ఫోన్ వాడకాన్ని కొన్ని రోజుల క్రితం ఆలయ ఈఓ నిషేధించారు. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బంది ఆ నిషేధాన్ని విస్మరించడం కలకలం రేపింది. భక్తులలో ఆగ్రహాన్ని పెంచింది.
తూర్పు రాజగోపురం దగ్గర సెల్ ఫోన్లు చెక్ చేయాల్సిన సిబ్బందే ఫోన్ వాడటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సెల్ ఫోన్ వాడటం కొందరికేనా...? అందరికా...? అని భక్తులు ప్రశ్నించారు. ఉత్తర్వులను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ సిబ్బందే అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను బ్రేక్ చేయడంతో భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిషేధాన్ని కఠినంగా పాటించే విధంగా చూడాలని కోరారు భక్తులు.