ఎయిర్ పోర్టులో భద్రత మరింత కట్టుదిట్టం

ఎయిర్ పోర్టులో భద్రత మరింత కట్టుదిట్టం

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. రిపబ్లిక్ డే నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, అప్పటివరకు ఎలాంటి విజిటర్ పాసులు ఉండవని స్పష్టం చేశారు. 

భద్రత బలగాల ఆధ్వర్యంలో నిత్యం డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్​తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే ఎయిర్​పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు అధికారులు సూచించారు.