షిండే సేనలోని ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ కుదింపు: మహారాష్ట్ర హోంశాఖ నిర్ణయం

షిండే సేనలోని ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ కుదింపు:  మహారాష్ట్ర హోంశాఖ నిర్ణయం

ముంబై: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలోని లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని హోంశాఖ.. డిప్యూటీ సీఎం ఏక్‌‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు 'వై' సెక్యూరిటీ కవర్‌‌ను ఉపసంహరించుకున్నది. 

బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌‌సీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా భద్రతను తగ్గించారు. అయితే, షిండే వర్గంతో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువ అని తెలుస్తున్నది.  రాష్ట్ర వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో భాగంగానే ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు  పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

2022లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు 'వై' కేటగిరీ భద్రతను కల్పించిన విషయం తెలిసిందే.