వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ట్రంప్ఎన్నికయ్యాక ఆయనకు అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో ఫ్లోరిడాలోని ఆయన నివాసం మార్ ఏ లాగో ఎస్టేట్చుట్టూ రోబో డాగ్‍లతో పహారా కాస్తున్నారు. నివాసం చుట్టూ ఉన్న సరస్సులో ఆర్మ్ డ్ బోట్‌తో సెక్యూరిటీ సిబ్బంది 24 గంటలూ గస్తీ తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. మరో ర్యాలీలోనూ ఓ ఆగంతకుడు వెపన్తో దొరికాడు. తాజాగా, ఆయన హత్యకు కుట్ర పన్నారని పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నివాసం చుట్టూ సెక్యూరిటీ కోసం రోబో డాగ్‌లను నియమించారు.
రోబో డాగ్స్ వీడియో వైరల్
డొనాల్డ్ ట్రంప్ నివాసం చుట్టూ రోబో డాగ్స్ పహారా కాస్తున్న వీడియోను ‘‘ది న్యూయార్క్ పోస్ట్’’ విడుదల చేసింది. ‘బోస్టన్ డైనమిక్స్’కంపెనీతయారుచేసిన రోబో డాగ్ ట్రంప్ ఇంటి ఆవరణలో అటూ ఇటూ నడుస్తూ కనిపించింది. ‘నన్ను తాకకండి’ అని దానిపై రాసి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రోబో డాగ్స్అడ్వాన్స్డ్ సెన్సర్లు, నిఘా సాంకేతికతతో తమ రక్షణ చర్యలకు మద్దతుగా నిలుస్తాయని అమెరికా సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి తెలిపారు.