ఫోక్ సింగర్​పై దేశద్రోహం కేసు

ఫోక్  సింగర్​పై దేశద్రోహం కేసు

న్యూఢిల్లీ: భోజ్ పురి ఫోక్​ సింగర్​ నేహా సింగ్ రాథోడ్​పై దేశద్రోహం కేసు నమోదైంది. పహల్గాం టెర్రర్  అటాక్​పై నేహా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన ఫిర్యాదుతో లక్నో పోలీసులు ఆమెపై ఈ కేసు నమోదు చేశారు. ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుంటూ ‘ఎక్స్’ లో ఆమె వ్యాఖ్యలు చేశారని అభయ్  ప్రతాప్  సింగ్  అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. 

ఈ నేపథ్యంలో ఆమెపై కేసు పెట్టానని ఓ వార్తా సంస్థకు అతను వెల్లడించాడు. ‘‘మతం ఆధారంగా నేహా చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం ప్రజ లను మరో వర్గం వారిపై రెచ్చగొట్టేలా ఉన్నాయి. అంతేకాకుండా జాతీయ సమగ్రతపైనా ఆమె వ్యాఖ్యలు ప్రతికూల ప్రభావం చూపుతాయి” అని అభయ్  పేర్కొన్నాడు.