తిలక్ వర్మ ఈ హైదరాబాద్ కుర్రాడు ప్రస్తుతం ఐపీఎల్ ముంబై తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. 2022 నుంచి ముంబైకి ఆడుతున్నాడు. ముఖ్యంగా ఇటీవల జరిగిన గుజరాత్ టైటాన్స్ తో క్వాలిఫయర్ మ్యాచ్ లో తిలక్ అందరి దృష్టిని ఆకర్షించాడు. చేజింగ్ లో తిలక్ వర్మ 14 బంతుల్లోనే 43 పరుగులతో చెలరేగాడు. ముఖ్యంగా షమీ బౌలింగ్ లో ఏకంగా 24 పరుగులు చేసి ముంబైకి ఆశలు రేపాడు. చాలా మంది తిలక్ ఆటను మెచ్చుకున్నారు. ఈ లిస్టులో వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నాడు.
ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మను చూస్తూ తననను తాను చూసుకున్నట్లు ఉందని వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేశాడు. 1999లో భారత తరపున ఎంట్రీ ఇచ్చినప్పుడు తనను తాను చూసుకున్నట్లు ఉందన్నాడు. అయితే తిలక్ ఫిట్ నెస్ ,స్కిల్స్ పై దృష్టి పెట్టాలని సూచించాడు. తన ఆటతీరుకు పనికొచ్చే నైపుణ్యాలు నేర్చుకోవాలని చెప్పాడు. రెగ్యులర్ గా క్రికెట్ ఆడితే ప్రత్యేక కష్టపడాల్సిన అవసరం ఉండదన్న సెహ్వాగ్, తిలక్ కు ఆ చాన్స్ లేనందున ఫిట్ నెస్ పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. ప్రస్తుతం సూర్య ఆడే షాట్స్ ఎవరూ ఆడలేరని అలా తిలక్ కూడా స్పెషల్ షాట్స్ నేర్చుకోవాలని సూచించారు.