Salman khan : మా టెంపుల్కు వచ్చి క్షమాపణ చెప్పు..లేకపోతే రూ. 5 కోట్లు ఇవ్వు

Salman khan : మా టెంపుల్కు వచ్చి క్షమాపణ చెప్పు..లేకపోతే రూ. 5 కోట్లు ఇవ్వు

బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ కు వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. డబ్బులివ్వాలి..క్షమాపణ చెప్పాలి లేకపోతే చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా నవంబర్ 4న రాత్రి ముంబై పోలీసులకు మరో బెదింపు కాల్ వచ్చింది. సల్మాన్ ఖాన్  టెంపుల్ కు వచ్చి క్షమాపణ చెప్పాలి.. లేకపోతే చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వాట్సప్  మెసేజ్ వచ్చింది.

ముంబై పోలీసు ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు నవంబర్ 4 రాత్రి  గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో వాట్సాప్‌లో బెదిరింపు సందేశం వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు మాట్లాడుతున్నాడని..  కృష్ణ జింకలను చంపినందుకు  సల్మాన్ ఖాన్ మా గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి.. లేదంటే  రూ. 5 కోట్లు ఇవ్వాలి.. అలా చేయకుంటే  చంపేస్తాం. మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్‌గా ఉంది అని మెసేజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ALSO READ : వివాదంలో నటి కస్తూరి.. అసలేం జరిగింది..? ఏంటి ఈ కథ..? 

గత వారంలో సల్మాన్ కు బెదిరింపు కాల్ రావడం ఇది రెండోసారి అక్టోబర్ 30న సల్మాన్ కు బెదిరింపు కాల్ వచ్చింది. రెండు కోట్లు ఇవ్వకపోతే  చంపేస్తామని హెచ్చరించారు. దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు  బాంద్రా ఈస్ట్  కు చెందిన ఆజం మహ్మద్ ముస్తఫాను  అరెస్టు చేశారు .  5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ  అక్టోబర్ 17న కూడా ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే..ఈ మెసేజ్ చేసిన వ్యక్తి జంషేపూర్ కు చెందిన కూరగాయలు అమ్మే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.