గోమాతకు సీమంతం 

మూగజీవాలతో మనుషులకు ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!!  చాలామంది వాటిని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంటారు !!   నిజామాబాద్ జిల్లా తాడ్ల రాంపూర్ కు చెందిన ఒక రైతు గోమాతకు  సీమంతం జరిపించాడు. ఈసందర్భంగా గోవుకు చీరకట్టి, పూలతో అలంకరించాడు. దానికి పసుపు, కుంకుమ రాసి.. హారతి పట్టారు. ఈసందర్భంగా ఇంటిల్లిపాదీ కలిసి గోమాతకు వైభవంగా సీమంతం వేడుక చేశారు. ప్రత్యేకమైన పిండి వంటలు తయారు చేసి గోమాతకు తినిపించారు. దీంతో ఆ రైతు ఇంట్లో పండుగ వాతావరణం కనిపించింది.