ఓట్లను బేరమాడి మరీ బీఆర్ఎస్ పార్టీ కొనుక్కుంటుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగుడలో అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికి ఆరు గ్యారెంటీల ప్రచారంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క డోర్ టూ డోర్ క్యంపైన్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల కంటే ముందే ఎన్నికల మేనిఫెస్టోను ఆరు గ్యారెంటీలతో ప్రచారం చేపట్టిందని సీతక్క అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను బీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టిందని... వాళ్లు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాన్స్ ఇచ్చి గెలిపించాలని కోరారు. అవినీతి కరమైన కాళేశ్వరం ప్రాజెక్టులు, వాస్తు పేరుతో భవనాలు కట్టి తెలంగాణ ప్రజల సంపద కొల్లగొట్టమని... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సంపద పెంచుతాం ప్రజలకు పంచుతామని సీతక్క అన్నారు.
ALSO READ : తొమ్మిదిన్నర ఏళ్లుగా నేను చేసిన అభివృద్ధిని చూశారు