హైదరాబాద్, వెలుగు: సామాజిక రచయిత కడియాల సురేశ్ కుమార్ రాసిన ‘‘ఆదివాసుల ఆత్మ బంధువు సీతక్క’’ పుస్తకాన్ని బుధవారం ప్రజా భవన్ లో పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. తన జీవిత చరిత్ర పై పుస్తకం రాసి తన తల్లిదండ్రులకు అంకితం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ములుగు ప్రాంతానికి చెందిన సురేశ్ స్వశక్తితో ఎదిగిన మంచి రచయితగా గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తూ సన్మానించారు.
సీతక్క జీవితం, ఉద్యమం, పోరాటాల గురించి అనేక వివరాలు సేకరించి ఈ పుస్తకం రాసినట్టు రచయిత సురేశ్ కుమార్ తెలిపారు. ఈ పుస్తకానికి మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ, ఓయూ ప్రొఫెసర్ సి. కాశీం, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు ముందుమాట రాశారు. ఈ కార్యక్రమం లో బీసీ సంక్షేమ సంఘం మహిళా నాయకురాలు మాహియా రాజ్, సుష్మ కుమారి తదితరులు పాల్గొన్నారు.