నిబంధనలకు లోబడే ఏజెన్సీలకు పనులు

నిబంధనలకు లోబడే ఏజెన్సీలకు పనులు
  • నైపుణ్య శిక్షణ పథకంపై త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్పుడు ప్రచారం కరెక్ట్​కాదు: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ యువతలో స్కిల్స్​ పెంచేందుకు అమలుచేస్తున్న దీన్​దయాళ్​ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన(డీడీయూ– జీకేవై) పథకంపై  ఓ యూట్యూబ్​చానల్ లో ప్రసారమైన కథనాన్ని మంత్రి సీతక్క ఖండించారు. డీడీయూ జీకేవై పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని, ఇందులో కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతం ఉంటుందని, ఈ పథకంలో అవకతవకలు జరిగినట్టు తప్పుడు కథనం ప్రసారం చేశారని మండిపడ్డారు.

ఇది పూర్తిగా అవాస్తవమని, కేంద్ర, రాష్ట్రాల నిధుల వాటా మీద, పథకం అమలు, నిధుల విడుదల విధానంపై ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రసారం చేశారన్నారు. ఏపీకి చెందిన సాహితీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్​ అనే బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి రూ.33 కోట్లు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని కట్టు కథలు ప్రసారం చేశారని ఫైర్​అయ్యారు.

Also Read :- ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా చైతన్య