కేటీఆర్​కు ఆవేశ‌‌‌‌మెక్కువ‌‌‌..ఆలోచ‌‌‌న త‌‌‌క్కువ: సీతక్క ఫైర్

కేటీఆర్​కు ఆవేశ‌‌‌‌మెక్కువ‌‌‌..ఆలోచ‌‌‌న త‌‌‌క్కువ: సీతక్క ఫైర్
  • ఒక్క గ్రామానికే కొత్త స్కీమ్స్​ ప‌‌‌‌రిమితం చేసిన‌‌‌‌ట్టు భ్రమపడ్తున్నడు: మంత్రి సీతక్క ఫైర్​

హైదరాబాద్​, వెలుగు: ఒక్క గ్రామానికే కొత్త పథకాలను పరిమితం చేసినట్టు  కేటీఆర్  భ్రమ పడుతున్నారని.. ఆయనకు ఆవేశమెక్కువ, ఆలోచన తక్కువ అని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. ప‌‌‌‌థ‌‌‌‌కాలు రాని గ్రామాలు రణ‌‌‌‌రంగంగా మారుతాయ‌‌‌‌న్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. 

నూత‌‌‌‌న ప‌‌‌‌థ‌‌‌‌కాల‌‌‌‌తో గ్రామాల్లో పండుగ వాతావ‌‌‌‌ర‌‌‌‌ణం క‌‌‌‌న్పిస్తుంటే కేటీఆర్ ఓర్వ లేక‌‌‌‌పోతున్నార‌‌‌‌ని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ‘‘గణతంత్ర దినోత్సవాన్ని పుర‌‌‌‌స్కరించుకుని ప్రతి మండలంలో ఒక గ్రామంలో నాలుగు నూత‌‌‌‌న ప‌‌‌‌థ‌‌‌‌కాల‌‌‌‌ను విజ‌‌‌‌య‌‌‌‌వంతంగా ప్రారంభిస్తే.. కేటీఆర్ త‌‌‌‌ట్టుకోలేకపోతున్నడు. 

ఒక గ్రామంలో ప‌‌‌‌థ‌‌‌‌కాల అమ‌‌‌‌లు లాంఛ‌‌‌‌నంగా మొద‌‌‌‌లు పెట్టి.. ఇత‌‌‌‌ర గ్రామాల‌‌‌‌కు విస్తరిస్తారన్న ఇంగిత జ్ఞానం లేక‌‌‌‌పోతే ఎట్ల? అర్హులందరికీ సంక్షేమ ఫ‌‌‌‌లాలు అందించ‌‌‌‌డ‌‌‌‌మే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం” అని సీతక్క తెలిపారు. 

ఉచిత బ‌‌‌‌స్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, స‌‌‌‌బ్సిడీ గ్యాస్ సిలిండ‌‌‌‌ర్ వంటి ప‌‌‌‌థ‌‌‌‌కాలు అర్హులంద‌‌‌‌రికీ అంద‌‌‌‌డం లేదా? అని ప్రశ్నించారు. ‘‘ప్రజ‌‌‌‌ల‌‌‌‌ను రెచ్చగొట్టి రాజ‌‌‌‌కీయ ప‌‌‌‌బ్బం గడుపుకోవ‌‌‌‌డ‌‌‌‌మే కేటీఆర్ ప‌‌‌‌ని. 

బీఆర్ఎస్ లాగా ఎన్నిక‌‌‌‌ల ల‌‌‌‌బ్ధి కోసం మేం ప‌‌‌‌థ‌‌‌‌కాలు అమ‌‌‌‌లు చేయ‌‌‌‌డం లేదన్న విషయం ఆయన తెలసుకోవాలి” అని పేర్కొన్నారు. ద‌‌‌‌ళిత గిరిజ‌‌‌‌న కుటుంబాల‌‌‌‌కు మూడెక‌‌‌‌రాల భూమి, బీసీల‌‌‌‌కు బీసీ బంధు, మైనారిటీల‌‌‌‌కు మైనార్టీ  బంధు అని చెప్పిన బీఆర్​ఎస్​.. ఏ మేరకు వాటిని నెరవేర్చిందని నిలదీశారు.