తల్లిదండ్రులు జన్మనిస్తే.. డాక్టర్లు పునర్జన్మనిస్తారు: సీతక్క

తల్లిదండ్రులు జన్మనిస్తే.. డాక్టర్లు పునర్జన్మనిస్తారు: సీతక్క

తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు మనకు పునర్జన్మనిస్తారని అన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లా గంగారం ఏజెన్సీ మండలంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య  శిబిరాన్ని  ప్రారంభించారు సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  మారుమూల ప్రాంతాల్లో పోలీసులు వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.  వాతావరణ మార్పుల వల్ల ప్రజలకు కొత్త రోగాలు వస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు సీతక్క.

ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు భరోసాగా ఉంటామన్నారు సీతక్క. పోలీసులు అంటే ప్రజలకు సేవ చేయాలని, శాంతిభద్రతలను కాపాడాలన్నారు. వరదల సమయంలో పోలీసుల సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు.  గిరిజన ప్రాంతంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసినందుకు  జిల్లా ఎస్పీ సూధీర్ రాంనాధ్ కేకన్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 300  మంది వృద్ధులకు  దుప్పట్లు. యువకులకు క్రికెట్  క్విట్లను అందజేశారు సీతక్క.

ALSO READ | పార్టీలో పనిచేసే వారికే పదవులు : మంత్రి సీతక్క