
ఒక కుటుంబం, ఇద్దరు అన్నదమ్ములు, అనంతమైన భావోద్వేగాలు ఇదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు (SVSC). వెంకటేష్, మహేష్ బాబు మల్టీస్టారర్గా వచ్చిన ఈ మూవీ (మార్చి 7న) థియేటర్లలలో రీ రిలీజ్ అయింది.
పెద్దోడు, చిన్నోడుతో కలిసి ప్రేక్షకులు మరోసారి భావోద్వేగాలను పంచుకున్నారు. ఈ మూవీ రీ రిలీజ్ అయ్యి వారం రోజులు అవుతున్న కూడా థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. దాంతో SVSC బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తూ తన సత్తా చాటుతుంది.
SVSC మూవీ తొలిరోజు రూ.2.9కోట్లకి పైగా వసూళ్లను దక్కంచుకొని సంచలనం సృష్టించింది. దాంతో ఆరు రోజుల్లో రూ.6 కోట్లకి పైగా వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ కలెక్షన్స్ ఇంకా కొనసాగుతున్నాయి.
Also Read:-ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
ఇకపోతే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దాదాపు గ్రాస్, షేర్ కలిపి రూ.100 కోట్ల మేరకు రాబట్టింది. ప్రస్తుత SVSCవసూళ్ల దృష్ట్యా.. ఇప్పటివరకు టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో మూవీగా SVSCరికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రీ రిలీజ్ మూవీస్‌లో మురారి రూ.8.90 కోట్ల కలెక్షన్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
2013 లో విడుదలైన ఈ సినిమాను ఇప్పుడున్న యూత్ చూడాలని ఎన్నో ఏళ్ళ నుండి ఎదురుచూస్తు వచ్చారు. ఎందుకంటే సినిమాలోని ప్రతి కథనం, కుటుంబాలలో నెలకొన్న నిరోద్యోగ పరిస్థితులు, డబ్బుల్లేక పోతే ఎదుటివాళ్ళు చూసే చిన్నచూపు, కేవలం డబ్బులకే విలువిచ్చే మనుషులతో ఎలా దూరంగా బ్రతకాలో సినిమా కళ్ళకు కట్టినట్లు చూపించింది. అంతేకాకుండా, ఎదురుగా వచ్చే శత్రువుని సైతం చూసి పలకరించి, చిన్న చిరునవ్వుతో ముందుకెళ్తే చాలు అనే గొప్ప భావాన్ని తెలియజేసింది.