SVSCReRelease: క్రేజీ.. క్రేజీ.. క్రేజీ.. అక్షింతలతో, డ్యాన్సులతో ఫ్యాన్స్ కుమ్మేస్తున్నారు.. వీడియోలు వైరల్

SVSCReRelease: క్రేజీ.. క్రేజీ.. క్రేజీ.. అక్షింతలతో, డ్యాన్సులతో ఫ్యాన్స్ కుమ్మేస్తున్నారు.. వీడియోలు వైరల్

వెంకటేష్, మహేష్ బాబు నటించిన కుటుంబ కథా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (SVSC). దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా మళ్ళీ వెండితెరపై సందడి చేస్తుంది. శుక్రవారం (మార్చి 7న) థియేటర్లలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ అయింది.

ఈ సందర్భంగా వెంకీ, మహేష్ ఫ్యాన్స్ తమ క్రేజీ ఫీలింగ్స్ ను చూపిస్తున్నారు. 2013 లో విడుదలైన ఈ మూవీని చూడని యంగ్ ఫ్యాన్స్ ఇప్పుడు తమ హంగామా మొదలెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో ఫ్యాన్స్ విభిన్నమైన శైలిలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ALSO READ | Naga Chaitanya Sobhita: శోభిత- చైతూల వెకేషన్ ఫోటోలు వైరల్.. ఉల్లిపాయ సమోసాలు తింటూ చిల్

వైజాగ్ శ్రీరామ టాకీస్ లో 11 గంటల షోకి అక్షింతలతో వచ్చారు ఫ్యాన్స్. క్లైమాక్స్ లో వెంకటేష్, అంజలి పెళ్ళికి తమ వంతు అభిమానంగా అక్షింతలు చల్లుతూ సందడి చేశారు.

అలాగే హైదరాబాద్ శ్రీరాములు థియేటర్ లో మహేష్ మాస్  ఫ్యాన్స్ క్లాస్ సెలబ్రేషన్స్ చేశారు.మహేష్ బాబు చెల్లి పెళ్లి వేడుకలో ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ స్క్రీన్ ముందుకెళ్లి తమదైన డ్యాన్స్ లతో అలరించారు. అంతేకాకుండా తమ తమ సీట్లో నుంచి లేసి ఫొటోస్ తీస్తూ ఖుషి అయ్యారు.

అలాగే సుదర్శన్ థియేటర్ లో ఒక ఫ్యామిలీ మహిళ అభిమాని ఇంకా చెప్పాలి పాటకు తనదైన స్టెప్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే పెద్దోడు, చిన్నోడు ఫోన్ లో మాట్లాడుకునే సరదా సంభాషణ టైంలో.. ఓ ఇద్దరు అభిమానులు తమ ఫోన్లలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2013 లో విడుదలైన ఈ సినిమాను ఇప్పుడున్న యూత్ చూడాలని ఎన్నో ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే సినిమాలోని ప్రతి కథనం, కుటుంబాలలో నెలకొన్న నిరోద్యోగ పరిస్థితులు, డబ్బుల్లేక పోతే ఎదుటివాళ్ళు చూసే చిన్నచూపు, కేవలం డబ్బులకే విలువిచ్చే మనుషులతో ఎలా దూరంగా బ్రతకాలో సినిమా కళ్ళకు కట్టినట్లు చూపించింది. అంతేకాకుండా, ఎదురుగా వచ్చే శత్రువుని సైతం చూసి పలకరించి, చిన్న చిరునవ్వుతో ముందుకెళ్తే చాలు అనే గొప్ప భావాన్ని తెలియజేసింది.

అంతేకాకుండా, ఇందులో మహేష్ బాబు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినపుడు.. అక్కడ ఎదురయ్యే సన్నివేశం ప్రస్తుత సమాజంలో ఉన్న యూత్ కి మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. అలాగే ఇందులోని ప్రతి సన్నివేశంలోని డైలాగ్స్, ప్రేమలు, ఆప్యాయతలు, కోపాలు, బాధలు అన్నీ వర్గాల వారిని ఆకట్టుకునేలా చేశాయి. ఇందులో మహేశ్ బాబు గోదావరి యాసలో పలికిన డైలాగులకు విమర్శకులు మరియూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.