
స్టార్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబు నటించిన కుటుంబ కథా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (SVSC). ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులను టచ్ చేసింది. 2013 లో విడుదలైన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా మళ్ళీ వెండితెరపైకి రానుంది.
మార్చి 7న థియేటర్లలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్కు సిద్ధమైంది. ఈ సందర్భంగా మార్చి 4న రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. "మనల్ని నవ్వించి, ఏడిపించి, ప్రతి క్షణం గుర్తుండిపోయేలా చేసిన ఈ సినిమా మళ్ళీ తెరపైకి వస్తోంది. మార్చి 7న తిరిగి విడుదల అవుతున్న SVSC మాయాజాలాన్ని మళ్ళీ అనుభవించండి " అంటూ నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది.
2013 లో విడుదలైన ఈ సినిమాను ఇప్పుడున్న యూత్ చూడాలని ఎన్నో ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే సినిమాలోని ప్రతి కథనం, కుటుంబాలలో నెలకొన్న నిరోద్యోగ పరిస్థితులు, డబ్బుల్లేక పోతే ఎదుటివాళ్ళు చూసే చిన్నచూపు, కేవలం బంధాలకే విలువిచ్చే మనుషులతో ఎలా బ్రతకాలో సినిమా కళ్ళకు కట్టినట్లు చూపించింది. అది కూడా ఎదురుగా వచ్చే శత్రువుని సైతం చూసి పలకరించి, చిన్న చిరునవ్వుతో ముందుకెళ్తే చాలు అనే గొప్ప భావాన్ని తెలియజేసింది.
అంతేకాకుండా, ఇందులో మహేష్ బాబు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినపుడు.. అక్కడ ఎదురయ్యే సన్నివేశం ప్రస్తుత సమాజంలో ఉన్న యూత్ కి మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. అలాగే ఇందులోని ప్రతి సన్నివేశంలోని డైలాగ్స్, ప్రేమలు, ఆప్యాయతలు, కోపాలు, బాధలు అన్నీ వర్గాల వారిని ఆకట్టుకునేలా చేశాయి. ఇందులో మహేశ్ బాబు గోదావరి యాసలో పలికిన డైలాగులకు విమర్శకులు మరియూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
Also Read:-వార్ 2 అప్డేట్.. నాటు నాటుని మించేలా ఎన్టీఆర్, హృతిక్ లపై డ్యాన్స్-ఆఫ్ సీక్వెన్స్
నేను ఇలాగే ఉంటా నాలాగే ఉంటా అనే వెంకటేష్ చెప్పే డైలాగ్ ఎంతోమందిని కనెక్ట్ చేసింది. అలాగే పూల కుండీని ఎందుకు తన్నావ్ రా అనే చెప్పే డైలాగ్ సైతం విక్టరీ అండ్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కు ఎమోషనల్ టచ్ ఇచ్చింది.
ముఖ్యంగా సగటు డైలాగ్స్:
ఒక సామాన్యుడిగా ఈ సమాజానికి ఏమివ్వగలంరా..ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప.
దాన్ని మించింది ఏదన్నా ఉందేంట్రా. ఇదిగో ఈ జన్మకే వీడు నీ అన్నయ్య. ఈ జన్మకి వీడు నీకు తమ్ముడు.
ఈ జన్మకి నేను మీ నాన్నని…’‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ సినిమాలో ప్రకాష్ రాజ్ వెంకటేష్, మహేష్ బాబులతో చెప్పే డైలాగ్ ఆలోచింపజేసింది. సమాజానికి, కుటుంబానికి, అన్నదమ్ముల అనుబంధానికి ఉన్న లింకేంటో గొప్పగా చెప్పాడు. ఇక చిన్నోడు, పెద్దోడిని మరోసారి చూడటానికి సిద్ధం అవ్వండి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్ బాబు ముఖ్య పాత్రలు పోషించారు. వీరితో పాటు ఇతర ముఖ్య పాత్రలలో సమంత, అంజలి, ప్రకాశ్ రాజ్, జయసుధ, రావు రమేష్ నటించారు.