తాగొచ్చి పాఠాలు చెప్తున్న టీచర్.. విద్యార్థుల ఆందోళన

మహబూబాబాద్​ : విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువు విచక్షణ మరిచాడు. చిన్నారులకు మంచి చెడు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే వక్రమార్గం పట్టాడు. మద్యం తాగి బడికి వస్తున్న టీచర్ తమకొద్దంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఆయనను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు.

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట హై స్కూల్లో మాథ్స్ టీచర్ నిత్యం మద్యం తాగి బడికి వస్తున్నాడు.  తాగిన మైకంలో పాఠాలు చెబుతుండటంతో లెక్కలు అర్థంకాక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రోజులు గడిచినా మ్యాథ్స్ టీచర్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. ఈ లెక్కల సార్ మాకొద్దంటూ స్కూల్ బయట రోడ్డుపై బైఠాయించారు. ఆయనను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు.