లంగర్ హౌస్ లో సీజ్ ​చేసిన కార్లు దగ్ధం

మెహిదీపట్నం, వెలుగు: లంగర్ హౌస్ పోలీసులు స్వాధీనం చేసుకున్న రెండు కార్లు శనివారం రాత్రి దగ్ధమయ్యాయి. తనిఖీల్లో భాగంగా పట్టుకున్న వాహనాలను పోలీసులు స్టేషన్ కు ఇరువైపులా రోడ్డు పక్కన పార్క్​చేస్తున్నారు. చాలా రోజులుగా అలాగే ఉండడంతో చెత్త పేరుకుపోయింది.

శనివారం రాత్రి మంటలు చెలరేగి రెండు కార్లు తగలబడ్డాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సీజ్​చేసిన వాహనాలను వెంటనే గోషామహల్ కు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.