తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.కోటి నగదును తొర్రూరు పోలీసులు సీజ్ చేశారు. శనివారం తొర్రూరు పట్టణ కేంద్రంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న సుమారు కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.