2.6 కేజీల గంజా సీజ్ .. ఐదుగురు అరెస్ట్

2.6 కేజీల గంజా  సీజ్ .. ఐదుగురు అరెస్ట్
  • మరో ఐదుగురిపై కేసు 

మెహిదీపట్నం, వెలుగు:  ధూల్ పేటలో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ దాడులు చేసి 2.660 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేసి.. మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ధూల్ పేటలోని మల్చిపురా, లోయర్ ధూల్ పేట ఏరియాల్లో బుధవారం  ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ పోలీసులు దాడులు చేశారు. గంజాయి అమ్ముతున్న నీలేశ్ సింగ్, విశాల్ సింగ్, సంతోశ్​సింగ్, హడ్డి గౌరు, నీతూ భాయ్ లను అరెస్టు చేసి, మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

 నిందితుల వద్ద ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ , ఎస్ టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి, ధూల్ పేట సీఐలు మధుబాబు, గోపాల్, సిబ్బంది భాస్కర్ రెడ్డి,సైదులు ప్రకాష్ శ్రీధర్ రాకేశ్​ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్ ను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కమల్ హసన్ రెడ్డి అభినందించారు.

కిరాణాషాపులో సేల్

షాద్ నగర్: గంజాయి అమ్ముతూ అంతర్ రాష్ట్ర వ్యక్తి పట్టుబడ్డాడు. షాద్ నగర్ ఎక్సైజ్ సీఐ శేఖర్ తెలిపిన ప్రకారం.. ఒడిశాకు చెందిన తరుణ్ జోష్ జైన్  6 ఏండ్ల కిందట సిటీకి వచ్చి ఫరూఖ్ నగర్ లో కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. అక్కడ కంపెనీల్లో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులను టార్గెట్ గా చేసుకుని ధూల్ పేట నుంచి 
గంజాయిని అక్రమంగా తెచ్చి అమ్మకాలు కొనసాగిస్తున్నాడు. సమాచారం అందడంతో తరుణ్ జోష్ జైన్ కిరాణ షాపుపై బుధవారం దాడి చేసినట్టు చెప్పారు.

 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోగా.. 50 వేల విలువ ఉంటుందని, నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపామని తెలిపారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ని డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి,రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్, సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వలరెడ్డి అభినందించినట్లు తెలిపారు.