వేరే లెవల్: అంబులెన్స్‎లో 400 కిలోల గంజాయి.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

వేరే లెవల్: అంబులెన్స్‎లో 400 కిలోల గంజాయి.. పోలీసుల ఎంట్రీతో  సీన్ రివర్స్

రాష్ట్రంలో మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్‎గా మార్చాలన్న ప్రభుత్వ ఆదేశాలతో.. ఎక్కడికక్కడ తనిఖీలు, ఆకస్మిక దాడులు చేస్తూ డ్రగ్స్, గంజాయిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. పోలీసులు హై అలర్ట్ కావడంతో స్మగ్లర్లు కొత్త దారులు వెతుకుంటున్నారు. వివిధ మార్గాల్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేస్తున్నప్పటికీ.. చివరకు అడ్డంగా పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా అత్యవసర పేషేంట్ల తరలింపుకు ఉపయోగించే అంబులెన్స్‎లో గంజాయి రవాణా చేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు స్మగ్లర్లు. 

ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రాంతం నుండి భద్రాద్రి కొత్తగూడెం మీదుగా తమిళనాడుకు అంబులెన్స్‎లో సుమారు నాలుగు క్వింటాల నిషేధిత గంజాయిని తరలిస్తున్నారు. గంజాయి రవాణాపై పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు.. రామవరం వద్ద అంబులెన్స్ అడ్డుకుని తనిఖీలు చేశారు. అంబులెన్స్‎లో పెద్ద ఎత్తున గంజాయి ఉండటంతో వాహనాన్ని సీజ్ చేసి.. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రెస్ మీట్ ద్వారా తెలుపుతామంటున్నారు పోలీసులు.