నటరాజ్​ మిల్క్​ ట్రేడర్స్​ సెంటర్లో 600 కిలోల క్వాలిటీ లేని పన్నీర్ పట్టివేత

నటరాజ్​ మిల్క్​ ట్రేడర్స్​ సెంటర్లో 600 కిలోల క్వాలిటీ లేని పన్నీర్ పట్టివేత

అల్వాల్, వెలుగు: క్వాలిటీ లేని మిల్క్​ ప్రొడక్ట్స్​తయారు చేస్తున్నారనే సమాచారంతోఎస్ఓటీ పోలీసులు సోమవారం మచ్చబొల్లారం పీసరీ ఎన్​క్లేవ్​లోని నటరాజ్​ మిల్క్​ట్రేడర్స్​లో తనిఖీలు నిర్వహించారు. క్వాలిటీ లేని 600 కిలోల  పన్నీర్, మిల్క్ పౌడర్, పామాయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ల్యాబ్​కు పంపించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని అల్వాల్ పోలీసులకు అప్పగించారు.