రైలులో 9 కిలోల గంజాయి పట్టివేత

మధిర, వెలుగు: మధిర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో శక్రవారం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్​ప్రెస్​  లో తొమ్మిది కిలోల గంజాయిని గుర్తించినట్లు మధిర ఎక్సైజ్ సీఐ జంపాల రామ్మూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.

పక్కా సమాచారం మేరకు రైల్వే జీఆర్పీ పోలీసులతో కలిసి కోణార్క్ రైలులో తనిఖీలు నిర్వహించారు. ప్యాకెట్ల రూపంలో తరలిస్తున్న  బ్యాగులను గుర్తించారు. ఈ సరుకుకు సంబంధించిన వ్యక్తులు ఇంకా తెలియలేదు. గంజాయి స్వాధీనం చేసుకున్న టీం లో ఎక్సైజ్ ఎస్సై సీ.జనార్దన్ రెడ్డి, ముస్తఫా, గోపి రజాక్, నాగరాజు, రియాజ్ తదితరులు  పాల్గొన్నారు.