
అన్నపురెడ్డిపల్లి, వెలుగు : మండల కేంద్రంలో శుక్రవారం వాహన తనిఖీల్లో రూ.90,800 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెంట్లం చెక్ పోస్ట్ వద్ద యాతాలకుంట నుంచి చండ్రుగొండ వైపు వెళ్తున్న ట్రాలీ లో సరైన ఆధారాలు లేకుండా ఉన్న నగదును అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్ సీజ్ చేశారు. ఆ నగదును ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ కు అప్పగించినట్లు తెలిపారు.