
నారాయణపేట, వెలుగు : టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో రూ. 6,67,075 విలువైన అంబర్, జర్థ, గుట్కా ప్యాకెట్ల పట్టుకున్నట్టు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అశోక్ పసారి కిరాణం , కే. వెంకట్ రాములు కు చెందిన కృష్ణ కిరణంలో , నజీర్ అహ్మదకు చెందిన కిరాణంలో గుట్కాలు, విమల్, టొబాకో పట్టుకున్నట్టు తెలిపారు. సీఐ శివ శంకర్ ఆదేశాల తో ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.