హైదరాబాద్ లో భారీగా హవాలా నగదు పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ లోని కోఠిలో భారీగా హవాలా నగదు పట్టుపడింది.. గురువారం ( నవంబర్ 21, 2024 ) కోఠిలోని గుజరాతీ గల్లీ లో ముగ్గురు వ్యక్తులు యాక్టివా బైక్ పై ఓ బ్యాగ్ లో రూ.22 లక్షల నగదును తరలిస్తుండగా పట్టుకున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు.ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుండి ఒక యాక్టివాతో పాటు 22 లక్షల నగదును స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.

సీజ్ చేసిన నగదును ఇన్కామ్ టాక్స్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు సుల్తాన్ బజార్ పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు హవాలా నెట్వర్క్ వెనక సూత్రధారులను పట్టుకునే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.