
అలంపూర్, వెలుగు: కర్నాటక నుంచి అక్రమంగా తెచ్చిన రూ.1.50 లక్షల విలువ చేసే మద్యం పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎస్ఐ అనంతరెడ్డి తెలిపారు. ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామానికి చెందిన వడ్డే రమేశ్, వడ్డే ప్రతాప్ కర్నాటక రాష్ట్రం రాయచూర్ లోని వైన్ షాపులో 5,280 టెట్రా ప్యాకెట్ల మద్యం కొనుగోలు చేసి కారులో ఏపీలోని కర్నూల్ కు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో డీటీఎఫ్ సీఐ పటేల్ బానోత్తో కలిసి తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఇద్దరిపై కేసు నమోదు చేయగా, వడ్డే ప్రతాప్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.