
మనోహరాబాద్, వెలుగు: మండలంలోని కాళ్లకల్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో రూ.95 వేలు సీజ్ చేసినట్లు మనోహరాబాద్ ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తూప్రాన్ పట్టణ పరిధి రావెల్లికి చెందిన బూర్గుల జయరాంరెడ్డి ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు తీసుకెళ్తుండడంతో స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సీజ్ చేసిన నగదును డీటీవో సిద్దిపేటకు తరలించినట్లు చెప్పారు.