మహబూబాబాద్‌‌ జిల్లాలో పది ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మహబూబాబాద్‌‌ జిల్లాలో పది ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్‌‌ జిల్లా నర్సింహులపేట ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ‘వెలుగు’ పేపర్‌‌లో వచ్చిన ‘ఆకేరును తోడేస్తున్నరు’ వార్తకు స్పందించిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్‌‌ ఆఫీసర్లు బుధవారం కొమ్ములవంచ, జయపురం, కౌసల్యాదేవిపల్లి గ్రామాల్లో తనిఖీలు చేశారు. 

.ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్‌‌స్టేషన్‌‌కు తరలించి కేసులు నమోదు చేశారు. అయితే ఉదయం ఆఫీసర్లు తనిఖీలు చేసే టైంలో పరారైన వ్యక్తులు మధ్యాహ్నం తర్వాత తిరిగి ఇసుక ర్యాంపుల వద్దకు చేరుకున్నారు. బుధవారం రాత్రి నుంచి మళ్లీ యథావిధిగా ఇసుక తరలింపును స్టార్ట్‌‌ చేయడం గమనార్హం.