
- ఆరిజిన్ డెయిరీ సీఏవో షేజల్
- బెల్లంపల్లి పీఎస్ఎదుట ఆందోళన ..ఫిర్యాదు
బెల్లంపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని అరిజిన్ డెయిరీ సీఏవో బోడపాటి శేజల్ డిమాండ్ చేశారు. శుక్రవారం బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు డెయిరీ డైరెక్టర్ ఆదినారాయణతో కలిసి ఆందోళన చేశారు. ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 1న బెల్లంపల్లిలోని హరికిషన్ సోని గోల్డ్ షాప్ సమీపంలో ఉన్న తనపై సన్ని బాబు, కొత్తపల్లి రాజ్ కుమార్, శ్యామ్ కుమార్, గోలి శివ, అలీ, కుంబాల రాజేశ్హత్యాయత్నం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం తన గోడును పట్టించుకోలేదేని, పోలీసులు కూడా స్పందించలేదన్నారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.