Kubera: కోర్టు వివాదంలో శేఖర్ కమ్ముల కుబేర మూవీ

Kubera: కోర్టు వివాదంలో శేఖర్ కమ్ముల కుబేర మూవీ

టాలీవుడ్ సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekar Kammula) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర(Kubera). తమిళ స్టార్ ధనుష్(Danush) హీరోగా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) కీ రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన మోషన్ పోస్ట్ సినిమాపై అంచనాలు పంచేసింది. ఇక ఈ సినిమాలో ధనుష్ కనిపించిన విధానానికి ఆడియన్స్ అవాక్కయ్యారు. 

చెరిగిన జుట్టు, మాసిపోయిన గడ్డం, లూజ్ చొక్కాలో ఉన్న బికారిగా కనిపించారు ధనుష్. ఈ లుక్ చుసిన ఆడియన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడమే కాదు.. కుబేర సినిమాపై స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ కుబేర విషయంలో కోర్టుకు వెళ్ళాడట నిర్మాత కర్మికొండ నరేంద్ర. 

ఈ విషయం గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుబేర అనే టైటిల్‌ను తెలంగాణ ఫిలిం చాంబర్‌లో నేను రిజిస్టర్‌ చేసుకున్నాను. ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా డబ్బింగ్‌ దశలో ఉంది, త్వరలో రిలీజ్ కానుంది. అలాంటిది.. ఇప్పుడు అదే టైటిల్ తో టైటిల్‌ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ వారు కాపీ కొట్టి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇదే విషయంపై ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లో ఫిర్యాదు చేశాము. వారి నుండి ఎలాంటి స్పందన రాలేదు. అందుకే.. కోర్టును ఆశ్రయించాము. కుబేర టైటిల్‌ విషయంలో న్యాయపోరాటానికైనా తాము సిద్ధమేనని చెప్పుకొచ్చాడు కర్మికొండ నరేంద్ర. మరి ఈ వివాదం సద్దుమణుగుతుందా.. శేఖర్ కమ్ముల టీమ్ ఎలా స్పందించనుందో చూడాలి.