శేఖర్ కమ్ముల ‘నీ చిత్రం చూసి’ సాంగ్ రిలీజ్

శేఖర్ కమ్ముల అనగానే అందమైన ప్రేమకథలు గుర్తొస్తాయి. ‘లవ్ స్టోరీ’ పేరుతో మరో ఫీల్ గుడ్ మూవీ ఆయన నుండి వస్తోంది. ఇప్పటికే టీజర్‌‌తో రేవంత్, మౌనికలుగా చైతూ, సాయి పల్లవిలను పరిచయం చేసిన శేఖర్..  ప్రేమికుల రోజు సందర్భంగా ‘నీ చిత్రం చూసి’ అనే పాటని విడుదల చేశాడు. పవన్ సీహెచ్ కంపోజ్ చేసిన ఈ పాటని మిట్టపల్లి సురేందర్ రాశాడు. అనురాగ్ కులకర్ణి పాడాడు. హైదరాబాద్ హిస్టరీలోని ప్రేమకథలని గుర్తుచేసే పురానా పూల్, తారామతి, బారాదరి, కోటి రెసిడెన్సీ, బ్రిటిష్ రెసిడెన్సీ ప్రాంతాల పెయింటింగ్స్​ని ఈ పాటలో చూపించారు. చివరగా ఈ సినిమాలో హీరో హీరోయిన్ల లవ్ స్పాట్ ‘రేవంత్ జుంబా సెంటర్’తో పాట ముగించారు. మొత్తానికి ఇదికూడా చరిత్రలో మరచిపోలేని ఓ ప్రేమకథ అవుతుందని ఈ పాట ద్వారా చెప్పారు. ఏప్రిల్ 16న ఈ సినిమా రిలీజ్ కానుంది. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌‌‌‌ను చెడుగుడు ఆడేసుకున్నారు

కళ్లు చెదిరే క్యాచులతో అదరగొట్టిన పంత్

25 మందిని కాపాడిన ఫోన్‌ కాల్‌: ధౌలిగంగ ఉప్పొంగుతోంది కొడుకా ఉరుకు

గ్రెటా థన్‌బర్గ్ ‘టూల్ కిట్’కు సాయం.. బెంగళూరు స్టూడెంట్‌ అరెస్ట్‌