
నారాయణపేట, వెలుగు: డీఎస్సీ ఫలితాల్లో నారాయణపేట మండలం అప్పిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గవినోళ్ల రఘు రామేశ్వర్రెడ్డి జిల్లా మొదటి ర్యాంక్ సాధించారు. రఘురామేశ్వర్రెడ్డి 2012లో బీటెక్ చేశాడు. అనంతరం స్పెషల్ ఎడ్యుకేషన్లో బీఈడీ చేశాడు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఎస్ఓగా పని చేస్తూ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. డీఎస్సీ లో జిల్లా ర్యాంక్ సాధించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తనకు తన తల్లిదండ్రులు ప్రోత్సాహంతో విజయం సాధించానని తెలిపారు.