బాన్సువాడ, వెలుగు : జిల్లాలో బ్యాటరీ సైకిళ్లు తదితర పరికరాలను పంపిణీ చేసేందుకు 1892 మంది దివ్యాంగులను గుర్తించినట్లు బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాన్సువాడ శివారులోని బీర్కూరు రోడ్డులో ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్ లో పరికరాలను అందించేందుకు ఎంపిక శిబిరం ఏర్పాటు చేశారు. అలీమ్ కో హైదరాబాద్, జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేశారు.
ఈ శిబిరానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఈ శిబిరాల ద్వారా ఎంపికైనవారికి ఉచితంగా బ్యాటరీ సైకిల్, వీల్ చైర్లు, చంక కర్రలు, వినికిడి యంత్రాలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమానికి ఆగ్రోటెక్ చైర్మన్ కాసుల బాలరాజు, జిల్లా సంక్షేమశాఖ అధికారి ప్రమీల, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.