స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ తైక్వాండో పోటీలకు ఎంపిక

మరిపెడ, వెలుగు : స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ తైక్వాండో పోటీలకు మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా మరిపెడ మండలం సీతారాంపురం జడ్పీహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లు ఎంపికయ్యారు. అండర్‌‌‌‌‌‌‌‌ 14 కేటగిరీలో గంగోత్రి, భాను, సంజయ్, అండర్‌‌‌‌‌‌‌‌ 17 కేటగిరిలో సుశాంత్, చరణ్‌‌‌‌‌‌‌‌ తేజ, అనిల్, రాకేశ్‌‌‌‌‌‌‌‌, చరణ్, శ్రీకాంత్, ఎల్లయ్య సెలెక్ట్ అయ్యారు. వీరు ఈ నెల 28, 29న తాండూరులో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. ఎంపికైన స్టూడెంట్లను హెచ్‌‌‌‌‌‌‌‌ఎం రామచంద్ర, పీఈటీ రాజకుమారి అభినందించారు.

స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌కు ఆర్డీఎఫ్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లు

పర్వతగిరి, వెలుగు : వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ వనితా అచ్యూతపాయ్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌ కాలేజీకి చెందిన సాయి చరణ్‌‌‌‌‌‌‌‌ జీవనైపుణ్య విభాగంలో స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ జనార్దన్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. పోతన విజ్ఞాన పీఠంలో జరిగిన జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో సాయిచరణ్‌‌‌‌‌‌‌‌ ప్రతిభ చూపి స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌కు ఎంపికయ్యారు. వచ్చే నెలలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరగనున్న పోటీల్లో సాయి చరణ్‌‌‌‌‌‌‌‌ పాల్గొననున్నారు.