వనపర్తి జిల్లాలో ఎస్జీఎఫ్​పోటీలకు హైస్కూల్ స్టూడెంట్స్​ ఎంపిక

కొత్తపల్లి, వెలుగు : ఈ నెల19 నుంచి 21వ తేదీ వరకు వనపర్తి జిల్లాలో జరుగనున్న రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్​ వాలీబాల్​ పోటీలకు పట్టణంలోని తేజస్​ జూనియర్​ కాలేజ్​విద్యార్థి హరికృష్ణ, మంకమ్మతోట పారమిత హైస్కూల్​ విద్యార్థి అశ్విత్​ ఎంపికయ్యారు.

అంతర్ జిల్లా వాలీబాల్ పోటీలను ఇల్లంతకుంటలో నిర్వహించగా అండర్ –17లో హరికృష్ణ, అశ్విత్​ జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తేజస్​ కాలేజ్​ డైరెక్టర్​ సతీశ్​రావు, పారమిత హెచ్ఎం బాలాజీ తెలిపారు.