సికింద్రాబాద్, వెలుగు: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్ఎస్) కింద కామారెడ్డి రైల్వేస్టేషన్ ఎంపిక కాగా, పునర్నిర్మాణ పనులతో కొత్తరూపు సంతరించుకోనుంది. దక్షిణ మధ్య రైల్వేలోని 40 రైల్వే స్టేషన్లలో రూ. 2,737 కోట్ల అంచనాతో ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపికైన స్టేషన్లలో కామారెడ్డి స్టేషన్ కూడా ఉంది. ఈ స్టేషన్ను రూ.39.84 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేయనున్నారు. ప్రధాని రాష్ట్రంలోని స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు పూర్తయితే కామారెడ్డి స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.