వరంగల్లో క్రికెట్​టోర్నమెంట్​కు క్రీడకారుల ఎంపిక

హనుమకొండ సిటీ, వెలుగు : ఈనెల 26 నుంచి వరంగల్ కేంద్రంగా జరుగనున్న అండర్–19 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కు దేశాయిపేటలోని సీకేఎం కాలేజీ గ్రౌండ్ లో వరంగల్ జిల్లా జట్టు ఎంపిక చేశారు. ఉమ్మడి జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరుకాగా బ్యాటింగ్, బౌలింగ్ ప్రతిభ కనబర్చిన 18 మంది క్రీడాకారులతో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు సెలెక్షన్ కమిటీ మెంబర్లు అభినవవినయ్, మట్టెడ కుమార్, తోటరాము, మెతుకు కుమార్ సోమవారం ఎంపిక చేసారు.

ఎంపికైన వారిని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్​ కుమార్ గౌడ్, సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్, మాజీ కార్యదర్శి మార్నేని ఉదయభానురావు, మాజీ కార్యవర్గ సభ్యులు బండారీ ప్రభాకర్ అభినందించారు. ఎంపికైన వారిలో ప్రార్థిషన్, రంగారావు, ఆరోగ్య చందర్, వితేశ్, అర్జున్, రిశ్వంత్, రిత్విక్, లక్షమన్, రామ్ చరణ్, ఆద్విక్, ఆదిత్య, రామ్, పూజిత్, మోమిన్ అమీన్, హర్తిక్ రాజు, శశిధర్, విగ్నేశ్, హస్సన్ ఉన్నారు.