ఎస్జీఎఫ్ నల్గొండ డివిజన్ జట్ల ఎంపిక

నల్గొండ అర్బన్, వెలుగు :  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నల్గొండ డివిజన్ జట్ల ఎంపికను శుక్రవారం జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్​ స్టేడియంలో డివిజన్ సెక్రటరీ తాళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలను నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హాజరై ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడాంశాలలో పోటీలు నిర్వహించి డివిజన్ జట్లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, కనగల్ జడ్పీటీసీ వెంకటేశం, ఎస్జీఎఫ్ సెక్రటరీ వాసుదేవరావు, ఎంఈఓ అరుంధతి, పీడీలు నర్సిరెడ్డి, నాగరాజు, శంభు లింగం, సాజిద్ అలీ, రామస్వామి, విమల పాల్గొన్నారు.

బీఈడీ కాలేజీ బిల్డింగ్​ ఓపెనింగ్​ 

నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులో రూ.33 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ బీఈడీ కాలేజీ బిల్డింగ్​ను శుక్రవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్​ వైస్​ చైర్మన్​ రమేశ్​గౌడ్, మార్కెట్​ చైర్మన్​ పంకజ్, కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లు పాల్గొన్నారు.