సింగరేణి బెస్ట్​ ఆఫీసర్లు, వర్కర్ల ఎంపిక

సింగరేణి బెస్ట్​ ఆఫీసర్లు, వర్కర్ల ఎంపిక

కోల్​బెల్ట్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సింగరేణి ఉద్యోగులు, అధికారులను సింగరేణి యాజమాన్యం శనివారం ఎంపిక చేసింది. మందమర్రి ఏరియా నుంచి బెస్ట్​ఆఫీసర్​గా రామకృష్ణాపూర్​ఓపెన్ ​కాస్ట్​ సీనియర్​సర్వే ఆఫీసర్​ మన్నేపల్లి శేఖర్, ఉత్తమ ఉద్యోగిగా కాసిపేట మైన్ కోల్​కట్టర్​ కె.సంతోష్​ను ఎంపిక చేశారు. 

శ్రీరాంపూర్​ ఏరియా నుంచి బెస్ట్​ఆఫీసర్​గా ఆర్కే–7 మైన్ ​డివైఎస్ఈ కోజా వెంకటరాము, ఉత్తమ ఉద్యోగిగా ఆర్కే-5 మైన్​ యాక్టింట్​ ఎస్డీఎల్​ ఆపరేటర్ ​సీదిరాల మల్లారావును యాజమాన్యం ఎంపిక చేసింది. బెల్లంపల్లి ఏరియా నుంచి బెస్ట్​ ఆఫీసర్​గా సీనియర్​ఎస్టేట్​అధికారి నవనీత, ఉత్తమ ఉద్యోగిగా ఖైరిగుడా ఓసీపీలో ఈపీ ఆపరేటర్​గా పనిచేస్తున్న మేకల స్వామిని ఎంపిక చేశారు. ఆదివారం కోత్తగూడెంలో జరిగే తెలంగాణ ఆవిర్భావ సెంట్రల్​ ఫంక్షన్​లో ఉత్తమ ఆఫీసర్లను సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్​ సన్మానించనున్నారు. ఉత్తమ ఉద్యోగులను ఆయా ఏరియాలో పరిధిలో నిర్వహించే వేడుకల్లో జీఎంలు సన్మానిస్తారు.