లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక

లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో భాగంగా ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి, 5వ తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం ఎస్సీ విద్యార్థినీవిద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన లక్కీ డ్రా నిర్వహించారు. 

ఒకటో తరగతిలో మొత్తం 47 మందిని ఎంపిక చేశారు. వీరిలో 31 మంది బాలురు, 16 మంది అమ్మాయిలున్నారు. 5వ తరగతిలో 45 మందిని ఎంపిక చేయగా వీరిలో 30 మంది బాలురు, 15 మంది బాలికలున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్​సీడీఓ సునీత, ఎస్సీ కార్పొరేషన్​ఈడీ శంకర్, అధికారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.