చొప్పదండి మండలం నుంచి ముగ్గురు ఎస్సైలుగా ఎంపిక

చొప్పదండి, వెలుగు : పోలీస్​ రిక్రూట్‌మెంట్​ బోర్డు ఆదివారం ప్రకటించిన ఎస్సై ఫలితాలలో చొప్పదండి మండలం నుంచి ముగ్గురు ఎస్సైలుగా ఎంపికయ్యారు. రుక్మాపూర్‌‌కు చెందిన కుంచెం మానస, గుమ్లాపూర్​కు చెందిన పొరండ్ల అనిల్​కుమార్​ సివిల్ ఎస్సైలుగా సెలెక్ట్ కాగా, గుమ్లాపూర్​కు చెందిన బత్తుల అభిలాష్ ఆర్ఎస్సైగా సెలెక్ట్ అయ్యాడు. 

ఒకే గ్రామం నుంచి ఇద్దరు .. 

ఎల్లారెడ్డిపేట, వెలుగు : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామం నుంచి ఇద్దరు యువకులు సివిల్​ఎస్‌ఐలుగా సెలక్ట్ అయ్యారు. పిట్ల దీపక్​ఇప్పటికే పెద్దూర్​బెటాలియన్‌లో కానిస్టేబుల్ కాగా, అందె సతీశ్ సివిల్​ఎస్సైగా ఎంపిక అయ్యాడు. దీపక్ తండ్రి శ్రీశైలం టీవీ మెకానిక్.