నేడు హైదరాబాద్‌‌లో స్టేట్ ఫెన్సింగ్ జట్లకు సెలక్షన్ ట్రయల్స్‌‌‌‌

హైదరాబాద్‌‌, వెలుగు : రాబోయే నేషనల్ ఫెన్నింగ్ చాంపియన్‌‌షిప్స్‌‌లో పోటీ పడే తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు  రాష్ట్ర క్యాడెట్( అండర్‌‌‌‌–17)  జట్ల కోసం శనివారం హైదరాబాద్‌‌లో సెలక్షన్ ట్రయల్స్‌‌ జరగనున్నాయి. మాదపూర్‌‌‌‌లోని డెక్కన్ ఫెన్సింగ్ క్లబ్‌‌లో  ఉదయం 8 గంటల నుంచి  ఈ ట్రయల్స్‌‌ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఫెన్సింగ్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ మెంబర్‌‌‌‌ సందీప్ కుమార్ జాదవ్ తెలిపారు.  

2008 జనవరి 1 –2011 డిసెంబర్ 21 తేదీల మధ్య జన్మించిన ఫెన్సర్లు అర్హులని వెల్లడించారు. ఫెనర్లు తమ సొంత కిట్‌‌తో ట్రయల్స్‌‌కు హాజరు కావాలని సూచించారు.