ఆర్మూర్​లో రాష్ట్ర స్థాయి బాల్​ బ్యాడ్మింటన్​ పోటీలకు ఎంపికలు

ఆర్మూర్, వెలుగు: డిసెంబర్ 22 నుంచి 24  మధ్య సికింద్రాబాద్ లో జరిగే 69వ రాష్ట్రస్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల కోసం గురువారం ఆర్మూర్​లో ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు హాజరయ్యారు.

వీరిలో ఉత్తమ ప్రతిభ  చూపిన వారిని  రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులకు ఈ నెల 18 నుంచి 21 వరకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రెసిడెంట్​మానస గణేశ్, సెక్రటరీ బి.శ్యామ్ తెలిపారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు స్వప్న, గీత, పీఈటీలు సునీత, రాజేందర్ పాల్గొన్నారు.