నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ సిటీలో ఆదివారం ఏకకాలంలో 11 వేల మంది యువత, మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ పై ట్రైనింగ్ఇవ్వగా, లిమ్కా బుక్ఆఫ్ రికార్డులో నమోదైంది. లీగల్ సర్వీసెస్అథారిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ గిరిరాజ్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ఈ ప్రోగ్రామ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తైక్వాండో కోచ్ మనోజ్ ట్రైనింగ్ఇచ్చారు. వారం రోజుల నుంచి ప్రచారం నిర్వహించడంతో బాలికలు, యువతులు, మహిళలు భారీగా వచ్చారు.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పటి వరకు ఏకకాలంలో 7 వేల మందికి మాత్రమే ట్రైనింగ్ ఇవ్వగా, తాజాగా ఇందూరులో ఈ రికార్డును అధిగమించినట్లు తమ రికార్డులో నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం జిల్లా జడ్జి సునీత కుంచాలకు మెడల్ అందజేశారు. స్టేట్ లీగల్అథారిటీ సెక్రెటరీ ఎస్.గోవర్ధన్‌రెడ్డి, సీపీ కల్వేశ్వర్సింగన్వార్, జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్డాక్టర్ ప్రతిమారాజ్ తదితరులు పాల్గొన్నారు.