వీదుల్లో తిరుగుతున్న డ్రైవర్ లేని రోబో ట్యాక్సీలు : బుక్ చేస్తే ఇంటి వద్దకే

వీదుల్లో తిరుగుతున్న డ్రైవర్ లేని రోబో ట్యాక్సీలు : బుక్ చేస్తే ఇంటి వద్దకే

అమెజాక్ కంపెనీ తయారు చేసిన Zoox డ్రైవర్ లెస్ కార్లు అమెరికాలోని కాలిఫోర్నియా వీదుల్లో రైయ్ రైయ్ మంటూ తిరుగుతున్నాయి. డ్రైవర్ల కొరత కారణంగా అక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా డ్రైవర్ లెస్ రోబో ట్యాక్సీలను అమెజాన్ కంపెనీ తయారు చేసింది. దాని పేరే అమెజాన్ Zoox రోబో ట్యాక్సీలు. ఈ చిన్న ఎలక్ట్రికల్ కార్లు 133 కిలో వాట్ల బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటాయి. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. ఓ రోజంతా తిరగగలవు. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే లొకేషన్ ను బట్టి మీ ఇంటి వద్దకే వచ్చి పికప్ చేసుకుంటాయి. మీరు వెళ్లాల్సిన చోటుకు సురక్షితంగా తీసుకెళ్తాయి.

Zoox రోబో ట్యాక్సీలు టాప్ స్పీడ్ గంటలకు 75 మైల్స్ ఫర్ అవర్. ఇవి 5స్టార్ క్రాష్ సేఫ్టీ ప్రొటెక్షన్ తో స్పెషల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా కలిగి ఉంటాయి. అనుకోకుండా ఎలాంటి యాక్సిడెంట్లు జరిగినా ప్రాణ నష్టం తక్కువే. ఇందులో నలుగురు కూర్చోడానికి సీటింగ్ ఏర్పాటు చేశారు. సెల్ప్ డ్రైవింగ్ కాబట్టి డ్రైవర్ అవసరం లేదు. ఈ బుజ్జి కారులో 5 లెవల్స్ అటోనోమస్ కంట్రోల్స్ ఉంటాయి.  వాటితో డ్రైవింగ్ కండీషన్లు మ్యానేజ్ చేయెచ్చు. 

142.9 ఇంచుల పొడవుతో ఓ మినీ క్యాబిన్ లా ఈ కార్ ను డిజైన్ చేశారు. చుట్టూ గ్లాస్ డోర్లుతో ఈ కార్లు ఉంటాయి. కారులోపల ఉన్న వ్యక్తులు 360 డిగ్రీస్ లో బయట ఉన్న అన్ని వస్తువులను చూడవచ్చు. అమెరికాలో ఈ డ్రైవర్ లెస్ కార్లను ప్రజా రవాణకు ఉపయోగిస్తున్నారు. ఆఫీసులకు, షాపింగ్ మాల్స్, ప్లే గ్రౌండ్స్ వెళ్లడానికి వీటిని బుక్ చేసుకుంటారు.