
వడ్డీలేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశం లభించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుకు ఫ్రీ లోన్లు ఇస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక గ్రూపులకు రూ.20 వేల కోట్లకు పైగా లోన్లు ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ తాజ్ డక్కన్ హోటల్ లో నిర్వహించిన స్త్రీ సమ్మిట్ 2.0 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భట్టీ. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రారంభించి డిప్యూటీ సీఎం.. మహిళా సాధికారత కోసమే స్ర్తీ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఒకవైపు స్త్రీలను దేవతలుగా చూస్తేనే మరోవైపు కంట్రోల్ చేయాలనే ప్రయత్నం తరతరాలుగా జరుగుతూనే ఉందని అన్నారు. హిందూ కోడ్ బిల్లుతోనే మహిళా సాధికారత ప్రారంభం అయ్యిందని, అంబేద్కర్ వల్లే మహిళలకు హక్కులు లభించాయని గుర్తు చేశారు. మహిళలకు వారతసత్వ హక్కులు లభించాయని తెలిపారు.
తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ స్కీం సక్సెస్ ఫుల్ గా నడుస్తోందని అన్నారు డిప్యూటీ సీఎం. సోలార్ ప్లాంట్ నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించామని, దీంతో సోలర్ ప్లాంట్ నిర్వహణలో మహిళలకు భాగస్వామ్యం లభించిందని అన్నారు. ఇలాంటి స్త్రీ సమ్మిట్ లతో మహిళా సాధికారత సాధించవచ్చుని పిలుపునిచ్చారు.