తాడ్వాయి, వెలుగు: గ్రామస్థాయి యువతీయువకుల నాయకత్వ నైపుణ్యాలను ప్రోత్సహించడానికి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని కొండ్రెడ్డి చెన్నారెడ్డి ఫంక్షన్ హాల్ లో తాడ్వాయి మండలంలోని గ్రామాల వారికి రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చారు.
బుధవారం ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ దివాకర హాజరవగా, పలువురు నాయకులు, యువత గ్రామాల్లోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో గోపాలరావు, ఎంఈవో రేగ కేశవరావు తదితరులు పాల్గొన్నారు.