హనుమకొండ జిల్లాలో సెల్ఫీ సరదా ఓ స్టూడెంట్ ప్రాణం తీసింది. నడికూడ మండలం కంఠాత్మకూర్ చెక్ డ్యామ్ లో జారిపడి మహమ్మద్ ఇస్మాయిల్ అనే యువకుడు మృతిచెందాడు. చెక్ డ్యామ్ దగ్గర ఇస్మాయిల్ సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఫోటో షూట్ కోసం ముగ్గురు స్నేహితులు కలిసి చెక్ డ్యాం దగ్గరకు వెళ్లినట్లు సమాచారం అందుతోంది. చెక్ డ్యామ్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా మహమ్మద్ ఇస్మాయిల్ జారిపడ్డాడు. వెంటనే మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ అతడిని కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.
ఇస్మాయిల్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కాజీపేటకు చెందిన వారు. కాలేజీకి వెళ్లిన కుమారుడు చెక్ డ్యామ్ వద్దకు వెళ్లి చనిపోయాడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ముగ్గురు కిట్స్ కాలేజీలో బీటెక్ చేస్తున్నారు. ప్రమాదంపై ఇస్మాయిల్ ఇద్దరు ఫ్రెండ్స్ ను పోలీసులు విచారిస్తున్నారు.